గోపీచంద్- ప్రభాస్ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడా..ఈసారైనా హిట్ కొడతాడా లేదా..!!

రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా గోపీచంద్ కూడా రాధాకృష్ణ ఒక కథ చెప్పాడని, గోపీచంద్ కి కూడా ఆ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందట.

మిత్రుడితో కలిసి హాలీవుడ్ మూవీ తిలకించిన ప్రభాస్.. ఎంత ఎత్తు ఎదిగినా ఇంతే - Prabhas enjoys Hollywood blockbuster With Hero Gopichand details, Prabhas , Salaar ,Gopichand, Hollywood ...

ఇక ఇప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణను, హీరో గోపీచంద్ ను కలిపింది కూడా యూవీ క్రియేషన్స్ అని టాక్ కూడా నడుస్తుంది. ఇక దర్శకుడు గోపీచంద్ ఇమేజ్ కోసం ఎలాంటి మాస్ కథ రాసుకున్నాడు చూడాలి. నిజానికి అయితే శ్రీకాంత్ అడ్డాలతో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ కుమార్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాడంతో.. ఇక ఇప్పుడు గోపీచంద్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాత్రం తాను రాసుకున్న కథ గోపీచంద్ కు కచ్చితంగా సూట్ అవుతుందని.. ఆ స్టోరీ కి న్యాయం చేయగలరని రాధాకృష్ణ భావిస్తున్నాడట.ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడట.

Share post:

Latest