Glimpse: జైలర్.. తో సక్సెస్ కొట్టేలా ఉన్న రజనీకాంత్..!!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సరే తలైవా క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నరసింహ తర్వాత రజనీకాంత్ తో కలిసి రమ్యకృష్ణ నటిస్తూ ఉండడంతో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు. చివరిగా రజనీకాంత్ రోబో సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నారు. ఆ తర్వాత పెద్దగా అంతటి సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.

First glimpse of Rajinikanth from Nelson's 'Jailer' | Tamil Movie News -  Times of Indiaకన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక రవితేజ మార్కు హంగామా మాత్రం ఈ సినిమాపై ఇంకా మొదలు కాలేదు గత కొంతకాలంగా తమ ఫామ్ ని కోల్పోతున్న రజనీకాంత్ ఈ సినిమాతో నైనా కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి చిన్న గ్లింప్స్ మేకర్స్ విడుదల చేయడం జరిగింది. కేవలం 13 సెకండ్లతో ఉన్న ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు ప్రేక్షకులు సైతం రజనీకాంత్ మళ్లీ తన స్టైల్ లో కం బ్యాక్ ఇవ్వనున్నారని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఫేమ్ లో కూడా రజనీకాంత్ తనదైన స్టైల్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తన రాజసంతో మరింత ఆకట్టుకునేలా ఈ గ్లింప్స్ లో కనిపించడంతో ప్రశంశల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ కాస్త వైరల్ గా మారుతోంది.