ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 10వ తారీఖున అనగా రేపు ఇండియాకి ఇంగ్లాండ్ కు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండిటిలో గెలిచిన టీమ్లు ఫైనల్లో తలపడనున్నాయి.
ఇప్పుడు రేపు జరగబోయే ఇండియా -ఇంగ్లాండ్ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్- ఇండియాతో మూడుసార్లు తలపడ్డాయి.
ఈ మూడు మ్యాచ్ లోనూ టీమిండియా -ఇంగ్లాండ్ పై రెండుసార్లు విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది.
2007 టి20 ప్రపంచ కప్ లో 18 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది. మళ్లీ తర్వాత 2009 టి20 ప్రపంచ కప్ లో మూడు పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. మళ్లీ 2012 టి20 ప్రపంచ కప్ లో భారత్ 90 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది.
ఇప్పటివరకు జరిగిన టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఇండియా- ఇంగ్లాండ్ నాకౌట్ దశలో తలపడింది లేదు. ఇదే తొలిసారి.. ఈసారి ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక అంతర్జాతీయ టి20 ప్రపంచకప్లో ఎప్పటి వరకు రెండు జట్లు 22 మ్యాచ్లు ఆడగా అందులో ఇండియా 12 మ్యాచ్లలో విజయం సాధించింది. ఇంగ్లాండ్ కేవలం 10 మ్యాచ్లలో విజయం సాధించింది.