తూర్పులో రెడ్లకు రిస్క్..ఒక్కరికే ఛాన్స్?

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువనే సంగతి తెలిసిందే..పైగా రివర్స్‌లో టీడీపీ కమ్మ పార్టీ అని, అక్కడ కమ్మలకే ప్రాధాన్యత ఉంటుందని విమర్శలు చేస్తారు గాని..వైసీపీలో ఉండే రెడ్డి వర్గం డామినేషన్ గురించి మాట్లాడారు. టీడీపీ కమ్మ నేతల హవా ఎలా ఉంటుందో..వైసీపీలో రెడ్డి నేతల హవా అంతకంటే ఎక్కువ ఉంటుంది. వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.

గత ఎన్నికల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఊహించని విధంగా గెలిచేశారు. అయితే కాపు, బీసీ, ఎస్సీ ఓటర్ల హవా ఎక్కువ ఉండే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూడా ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారంటే..వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో తూర్పులో ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనపర్తి నుంచి సూర్యనారాయణ రెడ్డి, కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డిలు గెలిచారు.

ముగ్గురు నేతలు జగన్ హవాలో గెలిచేసారు. పైగా జనసేన వల్ల ఓట్ల  చీలిక వీరికి కలిసొచ్చింది. కానీ ఈ సారి మాత్రం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసేలా ఉన్నాయి..దీంతో ఈ సారి ఈ రెడ్డి ఎమ్మెల్యేలకు గెలుపు డౌటే అని ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా ద్వారంపూడి, చిర్లకు గెలుపు గగనమే అనే పరిస్తితి. కాకినాడ సిటీ, కొత్తపేట నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి చెక్ తప్పదు.

కాకపోతే అనపర్తిలో కాస్త వేరే పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో సూర్యనారాయణ 55 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు. అప్పుడు జనసేనకు 12 వేల ఓట్లు పడ్డాయి. అంటే టీడీపీ-జనసేన కలిసిన సరే ఇక్కడ వైసీపీకి రిస్క్ తక్కువ. కాకపోతే గతంలో టీడీపీకి యాంటీ, జగన్ వేవ్ ఉన్నాయి. ఈ సారి ఆ పరిస్తితి లేదు వైసీపీకి నెగిటివ్ ఉంది..పైగా టీడీపీ పికప్ అవుతుంది..జనసేన బలం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా వైసీపీకి రిస్క్ అని చెప్పొచ్చు.

Share post:

Latest