ఎన్టీఆర్ 31వ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం.. ఏం ట్వీస్ట్ ఇచ్చాడ్రా సామీ..!!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తను తర్వాత చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. తర్వాత కేజిఎఫ్ సినిమాలతో అదిరిపోయే హిట్టు కొట్టి పాన్ ఇండియా దర్శకుడుగా మంచి క్రేజీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను దర్శకుడు భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే.

NTR 31: First look of Jr. NTR, Prashanth Neel movie "Telugu Movies, Music,  Reviews and Latest News"

ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషలో ఒకే రీతిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటక కు చెందిన వారు పైగా ఎన్టీఆర్ కు కన్నడ భాష బాగా తెలుసు.. అందుకే ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ భాషలో డబ్బింగ్ చేయడం కన్నడ సినిమాగానే ఈ సినిమాని నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Here Is What Prashanth Neel Said After Teaming Up With Jr NTR For NTR 31 -  MetroSaga

ఏదేమైనా వీళ్ళిద్దరి కలయికలో సినిమా వస్తుంది అనేసరికి పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు ప్రశాంత్ భారీ విజువల్స్ తోడైతే ఈ సినిమా మరో వండర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest