సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని హర్ట్ చేశాడా..!!

తెలుగు చిత్ర ప‌రిశ్రమలో లెక్కలు మాస్టర్ గా మంచి పేరు పొందిన దర్శకుడు సుకుమార్.. ఆయన అసిస్టెంట్ గా పని చేసి ద‌ర్శ‌కుడిగా మారిన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెన తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చు బాబు.. ఎన్టీఆర్ తో అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని తెలుస్తుంది.

buchi babu line up with Jr Ntr new project | The Telugu News

ఇప్పటికీ ఎన్టీఆర్ తో తన ప్రాజెక్టును అనౌన్స్ చేయకపోవడంతో తన తర్వాతి సినిమా ఏ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. మాస్ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను రెండేళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు బుచ్చిబాబు.. ఈ సినిమాని చేస్తాడో లేదో అనేది చూడాలి.. ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నారు ఇక ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమాతో కూడా బిజీ అవునన్నాడు ఎన్టీఆర్. బుచ్చిబాబు సినిమా ఏమవుతుందో చూడాలి.

Share post:

Latest