అవ్వ‌.. జాన్వీ క‌పూర్‌పై అనుమానంతో శ్రీ‌దేవి అలాంటి ప‌ని చేసిందా?

అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మ‌డు తాజాగా.. తన తల్లి శ్రీదేవి ఎంతో ఇష్టపడి చెన్నైలో కొనుగోలు చేసిన తొలి ఇంటికి వెళ్ళింది.

అక్కడ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హోం టూర్ నిర్వహించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంద్రభ‌వనాన్ని తలపిస్తున్న శ్రీదేవి ఇల్లును చూసి అభిమానులు, నెటిజన్లు నోరెళ్ల‌బెతున్నారు. ఇక హోం టూర్ చేస్తూనే జాన్వీ కపూర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే తన బెడ్ రూమ్ ను చూపిస్తూ ఓ సీక్రెట్ ను బయటపెట్టింది. `ఈ ఇంట్లో నా రూమ్ బాత్ రూమ్ కు లాక్ ఉండదు. బాత్ రూమ్‌లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమో అన్న భ‌యం అమ్మ లో ఉండేది. అందుకే నా బాత్ రూమ్‌కుకు లోపల వైపు లాక్ పెట్టేందుకు అమ్మ అంగీకరించలేదు` అంటూ జాన్వీ నవ్వుతూ చెప్పుకొచ్చింది. మొత్తానికి కూతురుపై అనుమానంతో శ్రీదేవి చేసిన పని ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారింది.

 

Share post:

Latest