చ‌ర‌ణ్ ఫ్లాప్ మూవీతో మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకు లింక్‌.. ఏంటో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస కాంబినేషన్లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల‌ కనిపించే అవకాశాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొద్ది రోజులు షూటింగ్ ఆపేసిన మేక‌ర్స్‌.. డిసెంబర్ రెండో వారం నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఖాన్ పూర్ ప్రత్యేక సెట్టింగ్ లో రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంద‌ట‌.

 

అయితే గతంలో బోయ‌పాటి శ్రీ‌ను, రామ్ చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన `వినయ విధేయ రామ` సినిమా కోసం అక్కడ సెట్టింగ్ వేశార‌ట‌. అది ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఆ సెట్టింగ్ లోనే చిన్న చిన్న మార్పులు చేసి మహేష్ సినిమా షూటింగ్ ను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి అలా చరణ్ సినిమాతో మహేష్ త్రివిక్రమ్ సినిమాకు లింక్ ఏర్పడింది. అయితే `వినయ విధేయ రామ` ఫలితం గురించి తెలిసిందే. భారీగా అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే ఇప్పుడు ఈ చిన్న కనెక్షన్ కారణంగా మహేష్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారని టాక్.

Share post:

Latest