కూతురు పెళ్లికి అలీ భార్య న‌గ‌ల షాపింగ్‌.. భారీగానే ఖ‌ర్చు పెట్టారు!

ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతియా వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాదులో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా అలీ ఇంత పెళ్లి సంభ‌రాలు షురూ అయ్యాయి. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం, బ్రైడల్ షవర్ పూర్తి అయ్యాయి.

ప్రస్తుతం అలీ భార్య జుబేదా తో కలిసి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికల‌ను పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఇక సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ లు కూడా చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే కుమార్తె పెళ్లికి అలీ భార్య జుబేదా వైజాగ్ లో న‌గ‌ల షాపింగ్ చేసింది. `అమ్మాయి పెళ్ళికి నగలు నాకు బిల్లు మా వారికి` అంటూ జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

మొదట కూతురి కోసం నగలు కొనడానికి అని భ‌ర్త‌ను తీసుకొచ్చిన జుబేదా.. షాపింగ్ మాల్ లోకి వ‌చ్చిన తర్వాత తాను కూడా నగలు తీసుకుంటానని చెప్పి ఆలీకి షాక్ ఇచ్చింది. ఇక భార్య ఇష్టాన్ని కాదనలేక కోరుకున్నంత బంగారం కొనిచ్చాడు అలీ. జుబేద ఏడు వారాల న‌గ‌లు మాత్రం వద్దంటూనే ఖ‌రీదైన ఆభరణాలను సెలెక్ట్ చేసుకుని భర్త ఆలీ చేత భారీగా ఖర్చు పెట్టించేసింది. ప్రస్తుతం జుబేదా పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Share post:

Latest