ఆఖరి ఛాన్స్ అంటున్న బాబు..హామీలు షురూ..!

గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తం చేసే వారు ఉన్నారు..అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇటు చంద్రబాబు ఏమో జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని అనుకుంటున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉంది.

అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలైన చంద్రబాబు..ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు..ఈ వయసులో కూడా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఇక తమ పార్టీ నేతలని యాక్టివ్ గా పనిచేసేలా చూస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాల వారీగా నేతలతో మాట్లాడి..దాదాపు అన్నీ స్థానాల్లో నేతలని సెట్ చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. జగన్ ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు రావచ్చని భావిస్తున్న బాబు..ఇప్పటినుంచే ఎన్నికల హామీలు ఇచ్చేస్తున్నారు.

తాజాగా బాబు కర్నూలు పర్యటనకు వెళ్లారు..అక్కడ భారీ స్థాయిలో రోడ్ షోలో నిర్వహించారు. కోడుమూరు, ఆలూరు, పత్తికొండ స్థానాల్లో బాబు రోడ్ షోలకు మంచి స్పందన వచ్చింది. ఈ రోడ్ షోల్లో ఎన్నికల హామీలని ఇచ్చారు..మళ్ళీ ఆదాయం సృష్టించి, ఇంతకంటే మెరుగ్గా సంక్షేమం అమలు చేస్తామని, ఉద్యోగాలు సృష్టిస్తామని, రాష్ట్రాన్ని గాడిలో పెడతానని అన్నారు. అదేవిధంగా ఇవే తనకు చివరి ఎన్నికలని, ఈ సారి గెలిపించుకోకపోతే మళ్ళీ రాజకీయాలు ఉందనని చెప్పుకొచ్చారు.

అంటే గతంలో జగన్ ఏమో ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఇప్పుడు చంద్రబాబు ఆఖరి ఛాన్స్ అని అడుగుతున్నారు. ఇక టి‌డి‌పి అధికారంలోకి వస్తే ఇప్పుడు వచ్చే పథకాలు ఆపేస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది. దానికి కౌంటరుగా ఏ ఒక్క పథకం ఆగదని, ఇంతకంటే మెరుగ్గా పథకాలు అందిస్తామని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎన్నికల పోరుకు తెరలేపారు.

Share post:

Latest