ఆదోని రేసులో సైకిల్..ఆ నేతతోనే భవిష్యత్.!

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చింది..చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు..బాబు పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా బాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు..మొదట పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పర్యటించగా, జనం పెద్ద ఎత్తున బాబు రోడ్ షోలకు వచ్చారు. అంత జనం వస్తారని టీడీపీ నాయకులే ఊహించి ఉండరు. ఒకవేళ జనాలని తరలించిన సరే..ఆ స్థాయిలో రావడం, గంటల గంటల సమయం వెయిట్ చేయడం అనేది జరగదు.

బాబు పర్యటనల్లో జనం చాలా వరకు స్వచ్ఛందంగా వచ్చి నిలబడిన వారే అని చెప్పొచ్చు. ఈ స్థాయిలో జనం రావడంతో కర్నూలు టీడీపీకి కొత్త ఊపు వచ్చింది. అయితే ఈ ఊపుని టీడీపీ నేతలు కొనసాగించేలా..అలా కాకుండా బాబు తిరిగారు కదా..ఇంకా మనం ఎందుకు జనంలో తిరగడం అని వదిలేస్తే మళ్ళీ పరిస్తితి రివర్స్ అవుతుంది. కాబట్టి నేతలు జనంలో తిరిగి..ఇదే ఊపుని కొనసాగిస్తే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టవచ్చు.

బాబు మొదట పర్యటించిన పత్తికొండ, కోడుమూరు, ఆలూరు స్థానాల కంటే ఎక్కువగా ఆదోని, ఎమ్మిగనూరు స్థానాల్లో జనం భారీగా వచ్చారు. ఈ రెండు స్థానాల్లో భారీ స్థాయిలో జనం కనిపించారు. అంటే ఈ రెండు చోట్ల టీడీపీకి చాలా వరకు పాజిటివ్ కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఉన్న నేతలు దాన్ని కొనసాగిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు. గత రెండు ఎన్నికల్లో ఆదోనిలో టీడీపీ గెలవడం లేదు. మీనాక్షి నాయుడు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు.

పైగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు..అయితే కొంతకాలం నుంచి సాయిప్రసాద్‌కు గడపగడపలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఇటు మీనాక్షి నాయుడు జనంలో తిరుగుతున్నారు..ఇక ఇప్పుడు బాబు పర్యటనతో ఆదోనిలో టీడీపీకి సరికొత్త బలం వచ్చింది..దీన్ని ఇలాగే కొనసాగిస్తే నెక్స్ట్ ఆదోనిలో టీడీపీ గెలవడం సులువే.