ఓ మై గాడ్: షారుఖ్ ఖాన్ ఆస్తి అన్ని వేల కోట్లా.. టోటల్ విలువ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

బాలీవుడ్ బాద్ షా.. షారుక్ ఖాన్ ..ఈపేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఈ హీరో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. నిర్మాతగా ,టీవీ ప్రముఖుడిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ బాద్ షా గా కింగ్ కాంగ్ అని ఓ బిరుదులు కూడా అందుకున్నాడు . షారుక్ ఖాన్ దాదాపు 80 సినిమాల్లో నటించి..కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్లను అందుకున్నాడు.

Photo Gallery: Know the real price of house of dreams 'Mannat' of Shahrukh  Khan, see pictures...

సినిమాల పరంగా ఎటువంటి మైనస్ అనే పాయింట్ లేకుండా దూసుకుపోయిన షారుక్ ఖాన్ ..ఈ మధ్యకాలంలో కొడుకు కారణంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అయ్యారు. మనకు తెలిసిందే షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన జైలుకు వెళ్లి చెప్పకూడు కూడా తిన్నారు . కాగా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోరుకుంటున్న షారుఖ్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తుంది . కాగా షారుఖ్ ఖాన్ తన ఇన్నేళ్ల కెరియర్లో ఎంత సంపాదించారో తెలిస్తే కళ్ళు తిరిగి పోవాల్సిందే అంటున్నారు సినీ జనాలు.

ఇప్పటివరకు పదివేల కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబైలో కోట్లు ఖరీదైన ఇల్లులు నాలుగు ఉన్నట్లు షారుఖ్ ఖాన్ బంధువులు చెప్పుకొస్తున్నారు. ముంబై మొత్తం మీద షారుఖ్ ఖాన్ ఇల్లు చాలా స్పెషల్ అని ఇంటీరియర్ డిజైనర్ కూడా ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడ లేని విధంగా డిజైన్ చేయించుకున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ముంబైలో ఆయన ఉంటున్న ఇంటిని కొనుక్కోవడానికి సల్మాన్ ఖాన్ చాలా ట్రై చేసాడని కానీ కోట్లు ఖర్చు పెట్టి షారుఖ్ ఖాన్ దాన్ని కొనుక్కునేసాడు అని చెప్తున్నారు.

Blockbuster: Highly-Anticipated Teaser Of Shah Rukh Khan Starrer 'Pathaan'  Is Out, Watch The Video Inside!

కాగా షారుక్ ఖాన్ కి కార్లు పిచ్చి.. ఇప్పటివరకు ఆయన దగ్గర 10 కార్లు ఉన్నాయట. అంతే దాదాపు లండన్ లో లగ్జరీ బిల్డింగ్ ఉన్నట్లు.. దాని రేటు దాదాపు 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా దుబాయిలో కూడా షారుక్ ఖాన్ కు ఆస్తులు ఉన్నాయని సమాచారం . అంతేకాదు బాలీవుడ్ లెజెండ్ హీరో అమితాబ్ కంటే బాలీవుడ్ షారుక్ ఖాన్ కి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే షారుక్ ఖాన్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

Share post:

Latest