ఛీ.. ఛీ.. ప్ర‌భాస్ ప‌రువు అడ్డంగా తీసేశారు.. అతికి పోతే అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా`, ప్రభాస్ `బిల్లా` తదితర చిత్రాలను రీ రిలీజ్ చేయగా.. ఆయా సినిమాలు అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి రికార్డ్ సృష్టించాయి.

అయితే దొరికిందే చాన్సుగా అతి చేస్తే ఇక అంతే సంగతులు. తాజాగా వర్షం రీ రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్ర‌భాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్‌. రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ ఇండస్ట్రీ లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వ‌ర్షం సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అనేక థియేటర్లో ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయగా.. హైదరాబాద్ లోని కుకుట్ పల్లి, హైదరాబాద్ క్రాస్ రోడ్స్ వంటి చోట్ల హౌస్ ఫుల్స్ పడటం తప్పించి మిగతా చోట్ల ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొన్ని సెంటర్స్ లో ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ కూడా చేశారు. ఇంకేముంది యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాకు జనాలు లేరంటూ సోషల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేయడం షురూ చేశారు. మొత్తానికి అతికి పోయి ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు.

Share post:

Latest