టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షా సినిమా ఎన్టీఆర్ కెరియర్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని నిర్మాతగా బంగ్లా గణేష్ వ్యవహరించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు పెద్దగా లాభాలను తెచ్చి పెట్టలేదు. అయితే ఈ నెల నవంబర్ 19వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా.. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. వాస్తవానికి ఏదైనా ప్రత్యేకత ఉన్న సమయంలో ఇలాంటి చిత్రాలను విడుదల చేస్తే ఫలితం ఉంటుంది.
కానీ ఎలాంటి స్పెషాలిటీ లేకుండా కేవలం పాత సినిమాలను ఈ మధ్య రీ రిలీజ్ చేయడం వల్ల.. ఫలితాలు పెద్దగా ఉండలేదని వార్తలు వినిపిస్తున్నాయి. నట్టి కుమార్ బాద్ షా చిత్రాన్ని రీ రిలీజ్ చేయగ సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా విడుదల చేయడంతో ఈ సినిమా ప్రభావం పెద్దగా ప్రేక్షకుల పైన చూపలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా విడుదలైనట్లు తారక అభిమానులకు కూడా సరిగ్గా తెలియదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కాదా ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సి రాలేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ఇలా ఇష్టానుసారంగా సినిమాలను రీ రిలీజ్ చేయడం వల్ల ఎన్టీఆర్ ఇమేజ్‌కు డ్యామేజ్ వస్తుందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.బాద్ షా సినిమా రీ రిలీజ్ విషయంలో రాబోయే పెద్ద సినిమాల రీ రిలీజ్ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని సినీ ప్రముఖుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం పెరగలేదు తగ్గేలా కనిపిస్తోందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.