హీరోయిన్ అనుష్క కార్ల కలెక్షన్స్ చూస్తే మీకు మతి పోతుంది!

హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో వున్న బడా హీరోయిన్లలో ఈమెది మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. దాంతో ఆమె సంపాదన కూడా దండిగా ఉంటుంది. అయితే ఆమె సంపాదనలో ఎక్కువ భాగం.. బంగ్లాలు.. ఎస్టేట్స్‌తో పాటు కార్లపై ఇన్వెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బేసిగ్గా ఆమెకి కార్లంటే విపరీతమైన మోజు అట. మార్కెట్‌లో ఎలాంటి కొత్త కారు వచ్చినా.. తన గ్యారేజ్‌లో ఉండాల్సిందేనట. దాంతో అనుష్క గ్యారెజ్‌లో చాలా కార్లు కొలువు దీరాయట.

ఆ లిస్టులో మొదటిది Toyota Corolla Altis. అనుష్క శెట్టి సినిమా పరిశ్రమకి వచ్చాక కొన్న మొదటి కారు ఇదే. ఈ కారు రూ. 16.46 లక్షల నుంచి రూ. 20.20 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ విషయాలను అనుష్క పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించడం కొసమెరుపు. ఈ లిస్టులో రెండవది Audi Q5. ఈ కారు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీతో సహా 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 5-సీటర్ SUV కలిగిన ఈ కారు ధర దాదాపు రూ. 59.88 లక్షలు ఉంటుందని అంచనా. ఇక మూడవది Audi A6. పెట్రోల్ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు డిజైన్ స్పోర్టివ్‌గా ఉంది. దీని ధర కూడా రూ.59.84 లక్షల నుంచి మొదలవుతుంది.

ఇక ఈ లిస్టులో నాల్గవది BMW 6 Series ఈ కారు అనుష్క కలెక్షన్ లో అత్యంత ఖరీదైనది అని చెప్పుకోవచ్చు. ఈ టాప్ మోడల్ పెట్రోల్ ధర రూ.69.88 లక్షలు కాగా, బేస్ మోడల్ డీజిల్ ధర రూ.71.48 లక్షలు అని భోగట్టా. అనుష్క శెట్టి దగ్గర వీటితో పాటు పలు మోడల్స్‌కు చెందిన కార్లు ఉన్నాయని వినికిడి. వీటి విలువ దాదాపు రూ. 10 కోట్లకు పైనే ఉంటుందనేది సమాచారం. ఇకపొతే, అనుష్క శర్మ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ఆమె తన డ్రైవర్‌ అంకితభావాన్ని చూసి అతనికి రూ.12 లక్షల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చింది.

Share post:

Latest