డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరిని చెప్పవచ్చు. అంతలా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు ఈ డైరెక్టర్. త్రివిక్రమ్ తన సినిమాలోని కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్ తోనే ప్రతి సినిమాను తెరకెక్కిస్తూ ఉంటారని చెప్పవచ్చు.
డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఎప్పటినుంచో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉన్నారు. ఈయన చిత్రాలలో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ పెట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఒక సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రంలో కూడా ఇప్పటికే హీరోయిన్ పూజ హెగ్డే కన్ఫర్మ్ అయింది. కానీ సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్న సందర్భంలో ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లు గానే మిగిలిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది ఇక అది త్వరలోనే రెండో షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హారిక హాసిని బ్యానర్ పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఈమె గీతికా అన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికి డైరెక్టర్ తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరోగా నటించిన అహింస సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇ సినిమా విడుదల కాకుండానే ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది.