తమ్ముడు కంటే అన్ననే చాలా స్పీడ్ గా ఉన్నాడే..!!

నందమూరి హీరోలలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక విభిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు కళ్యాణ్ రామ్. తను చేస్తున్న ప్రయత్నాలలో ఫెయిల్ అయినా, సక్సెస్ అయిన పెద్దగా పట్టించుకోకుండా సినిమాలో చేసుకుంటూ వెళుతూ ఉంటాడు కళ్యాణ్ రామ్. అంతేకాకుండా కొత్తవారిని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా కూడా కళ్యాణ్ రామే వ్యవహరించారు.దీంతో మంచి లాభాలను అందుకున్నారు. ఈ సినిమా సీక్వెల్ ని కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు కళ్యాణ్ రామ్.

Exclusive: NTR finalizing scripts for Kalyanram | Manacinema | Jr NTR and  Nandamuri Kalyan Ram
అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి డెవిల్ ఈ సినిమా ఒక పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కళ్యాణ్ రామ్ మరొక మూవీ ఏమీగోస్ అంటూ మరొక క్రేజీ మూవీ తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల డేట్ అనౌన్స్మెంట్ చేస్తూ తాజాగా ఒక మోషన్ పోస్టర్ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ పోస్టర్ కూడా చాలా సంథింగ్ స్పెషల్ గా ఉందని ఈ పోస్టర్ను చూస్తే మనకి అర్థమవుతోంది.కానీ ఆడియన్స్ కి ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతి ఇవ్వాలని ఇలాంటి సరికొత్త కథలను డైరెక్టర్లను కళ్యాణ్ రామ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏమిగోస్ తో మరొక డైరెక్టర్ పరిచయం చేయబోతున్నారు. కథ స్క్రీన్ ప్లే తప్పకుండా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తుందని తెలియజేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే కళ్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ ఉంటే ఎన్టీఆర్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళలేదు. దీంతో తమ్ముడు కంటే అన్నే ముందువరుసలో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share post:

Latest