అంద‌రి ముందు యాంక‌ర్‌కు ముద్దు పెట్టేసిన‌ అనిల్ రావిపూడి.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్` సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ఎఫ్2` చిత్రం సైతం మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం ఉండటంతో.. ఈయ‌న ఓ కామెడీ షోకు జ‌డ్జ్‌గా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు `కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్` పేరుతో తెలుగులో మొట్టమొదటి కామెడీ షోను తీసుకువస్తుంది.

ఈ షోకు అనిల్ రావిపూడి జ‌డ్జ్ గా కనిపించబోతున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్ల‌గా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. తాజాగా ఈ షో ప్రోమోను మేకర్స్ బయటకు వ‌దిలారు. ఈ ప్రోమో అందరినీ బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో అనిల్ రావిపూడి అంద‌రి ముందు యాంకర్ దీపిక‌ పిల్లిని దగ్గరికి తీసుకుని ఆమె బొగ్గ పై ముద్దు పెట్టబోతున్న‌ట్లు చూపించారు. మరి నిజంగానే దీపికకు ముద్దు పెట్టారా లేదా అనేది స‌రిగ్గా చూపించ‌లేదు కానీ.. నెటిజ‌న్లు మాత్రం అనిల్ రావిపూడి లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest