గంగుబాయ్ గా మారిన శ్రీ‌ముఖి.. సేమ్ టు సేమ్ దింపేసిందిగా!

బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా `మిస్టర్ అండ్ మిస్సెస్` అనే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ షో కి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

 

ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్నఈ షో కి నిర్వాహకులు తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా శ్రీముఖి ఈ ప్రోమోలో కనిపించిన గెటప్ పే ఈ ఎపిసోడ్ కి హైలెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే `మిస్టర్ అండ్ మిసెస్` షో పేరు అయినప్పటికీ కూడా వారానికో కొత్త థీమ్ తో నిర్వాహకులు ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే వచ్చే వారానికి సంబంధించి ఈ ప్రోమోలో శ్రీముఖి రెగ్యులర్ గా స్టైలిష్ లుక్ లో కాకుండా కొత్త గెటప్ తో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా బాలీవుడ్ లో అలియా భట్ పోషించిన `గంగు భాయ్ కతియావాడి` గెటప్ లో కనిపించి కళ్ళు తిప్పుకోనికుండా చేసింది శ్రీముఖి. వైట్ చీర కట్టుకుని.. నల్ల కళ్ళద్దాలు మరియు నుదుటిపై ఎర్రని బట్టు ఇలా రెడీ అయి అందర్నీ ఆకర్షించింది. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన శ్రీముఖి అభిమానులు సేమ్ టు సేమ్ దింపేసిందిగా…అంటూ శ్రీముఖిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest