ఇంకో రెండు మ్యాచ్లు కప్ మనదే.. బాలకృష్ణతో శోభన్ బాబు ఫోటో వైరల్..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అనేది ఎంత వ్యసనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న విషయం బయటకు వచ్చిన, అది అన్నోన్ ఫ్యాక్ట్ అయినా… వచ్చిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోతుంది. ఇక సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసే ఫన్నీ మీమ్స్ అయితే మామూలుగా ఉండవు.. ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టి20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది.. టీమ్ ఇండియా ఎంతో అద్భుతంగా ఆడి సెమీస్‌కు వచ్చింది.

T20 World Cup: What will be Team India's playing XI? - The Week

టీమిండియాలో ఉన్న యంగ్ ప్లేయర్లు తమ ఆట తీరుతూ ఆకట్టుకుంటున్నారు.. ఇండియా మరో రెండు మ్యాచులు గెలిస్తే టి20 వరల్డ్ కప్ ద‌క్కించుకుంటుంది. ఇప్పుడు దీని గురించే సోషల్ మీడియాలో ఓ సాలిడ్ సినిమా పిక్ చక్కర్లు కొడుతుంది.. ఆ పిక్ లో నటభూషణ శోభన్ బాబు, నందమూరి బాలకృష్ణ కలిసి ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటున్నారు.

‘ఇది మీకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. సినిమా పరిశ్రమ కి ప్రేక్షకులకి మధ్య నారదులగా పనిచేస్తుంటారు పీఆర్వోలు.. వారు కొన్ని పాత సినిమాలుకు సంబంధించిన రేర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన ‘‘అశ్వమేథం’’ సినిమాకి సంబంధించిన ఫోటో ని షేర్ చేశారు’. ఆ ఫోటోలలో శోభన్ బాబు తన రెండు వేళ్ళు(విక్టరీ సింబల్) చూపిస్తూ.. ఇంకో రెండు మ్యాచులు గెలిస్తే కప్పు మనదే.. అని బాలకృష్ణకు చెబుతున్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest