అల్లు అర్జున్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఇప్పుడు ఆ ప‌ని చేస్తూ సెటిల్ అయ్యిందా…!

అల్లు అర్జున్ హీరోగా మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బన్నీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది గౌరీ ముంజల్. మొదటి సినిమాతోనే స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ప‌లు భాషల్లో సినిమాల్లో నటించింది. ఇన్ని భాషల్లో హీరోయిన్ గా నటించిన తాను ఆశించిన స్థాయిలో స్టార్ డ‌మ్‌ దక్కించుకోలేకపోయింది.

Bunny Telugu Full Length Movie || Allu Arjun, Gouri Munjal, Sarath Kumar || Allu Arjun Telugu Movies - YouTube

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ‘బన్నీ’, ‘శ్రీకృష్ణ 2006’, ‘గోపి గోడమీద పిల్లి’, ‘కౌసల్యా సుప్రజా రామా’, ‘బంగారు బాబు’ వంటి పలు సినిమాలలో నటించింది. ఎన్ని సినిమాలు చేసినా గౌరీముంజ‌ల్‌కు తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. 2009లో జగపతిబాబు హీరోగా వచ్చిన బంగారు బాబు సినిమా గౌరీ ముంజల్‌కు చివరి సినిమా. ఈ సినిమా తర్వాత 2011లో మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమంలో ఒక్కో సినిమాలో కనిపించింది.

Gowri Munjal HD Wallpapers | Latest Gowri Munjal Wallpapers HD Free Download (1080p to 2K) - FilmiBeat

ఆ తర్వాత ఆమె సినిమా పరిశ్రమకు దూరమైంది. ఆ త‌ర్వాత ఆమెపై కొన్ని కాంట్ర‌వ‌ర్సీలు కూడా న‌డిచాయి. ఈమె కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల చిత్ర పరిశ్రమకు దూరమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ ఢిల్లీలో తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ పలు వ్యాపారాలను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest