ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికాకి చెక్కేసిన అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటి దక్కించుకున్న ఈ హీరో.. ప్రజెంట్ పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సమ్మర్ కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడట బన్నీ. కాగా పుష్ప1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప2 రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు .

అయితే తెలుగు హీరో అల్లు అర్జున్ షూటింగ్ కి బ్రేక్ వేసి మరి సౌత్ ఆఫ్రికా చెక్కేసిన్నట్లు తెలుస్తుంది . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి ..పిల్లలు అల్లు అర్హ , అల్లు అయాన్ తో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా షూటింగ్ టైంలో ఏమాత్రం ఫ్రీ గా ఉన్న అల్లు అర్జున్ తన టైం మొత్తం ఫ్యామిలీకే కేటాయిస్తారు. కానీ షూటింగ్లో బిజీగా ఉన్నా సరే ఈసారి మాత్రం అల్లు అర్జున్ బ్రేక్ తీసుకుని మరి సౌత్ ఆఫ్రికా బయలుదేరారు. బన్నీ సౌత్ ఆఫ్రికా అంటే ఏ టూర్ కోసమో, వెకేషన్ కోసం అనుకునేరు.. కాదండి..

బన్నీ ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అల్లు అర్జున్ ఓ వివాహ వేడుకకి హాజరైందుకు ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికా వెళ్లినట్టు అల్లు కాంపౌండ్ నుంచి సమాచారం అందుతుంది. దీంతో సౌత్ ఆఫ్రికాలో బన్నీ ఫ్రెండ్ ఎవరబ్బా..? అంటూ సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ప్రజెంట్ ఎయిర్ పోర్ట్ లో బన్ని తన పిల్లలతో ,స్నేహారెడ్డి తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి.

Share post:

Latest