తండ్రి కాబోతున్న ఆది పినిశెట్టి.. హీరో ఇంట సంబ‌రాలు షురూ!?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని.. దీంతో హీరో ఆది పినిశెట్టి ఇంట సంబరాలు షురూ అయ్యాయని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివ‌రాల్లోకి వళ్తే.. దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా విల‌న్ గానూ న‌టిస్తూ తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తనతో రెండు సినిమాలు కలిసి నటించిన కన్నడ భామ నిక్కీ గల్రానీతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది మే 18న చెన్నైలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ప‌లువురు టాలీవుడ్ ప్రముఖుల సైతం వీరి వివాహానికి హాజరు అయ్యారు. అయితే తాజాగా నిక్కీ ప్రెగ్నెంట్ అయ్యిందట. త్వరలోనే ఆది-నిక్కీలు తల్లిదండ్రులు కాబోతున్నారట. కోలీవుడ్ లో ఇప్పుడీ వార్త తెగ వైరల్ అవుతుంది. కానీ దీనిపై ఎటువంటి అధికారక ప్రకటన లేదు. మరి నిజంగా ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest