ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించిన ఎన్టీఆర్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే సినీ ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని ప్రత్యేకమైన గౌరవం , ప్రేమ. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా.. సూటిగా మాట్లాడే ఎన్టీఆర్ తొందరపడి ఒక మాట మాట్లాడు. నిదానమే పేధానం అన్న రూల్ ని ఫాలో అవుతుంటారు. తొందరిపడి ఒక్కరి జోలికి వెళ్లడు. తన జోలికి వస్తే ఎవరిని వదలడు . అనవసరంగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి ..లేనిపోని వివాదాల్లో ఇరుక్కోడు ఈ నందమూరి నట వారసుడు.

కాగా రీసెంట్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినందుకు తారక్ స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే . అయినా కానీ అలాంటి ఇష్యూస్ పై ఒక్క మాట నోరు జారని తారక్..బుద్దిదా తన సినిమా పనులు తాను చూసుకుంటూ ఇండస్ట్రీలో మంచి పేరుతో కొనసాగుతున్నాడు . కాగా రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..త్వరలోనే మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 అనే పేరుతో ఓ సినిమాని ప్రారంభించబోతున్నాడు .

ఈ సినిమా అధికారికంగా ప్రకటించి చాలా కాలమే అవుతున్న స్క్రిప్ట్ సరిగ్గా లేనందున కొరటాలకు కొన్ని సజిషన్స్ ఇచ్చినట్టు..కొరటాల వాటిని మార్చే పనిలో బిజీగా ఉన్న కారణంగా ఎన్టీఆర్ ఈ సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోతున్నాడు . కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4 ఈ సినిమా అఫీషియల్ షూట్ ప్రారంభం కానందుని తెలుస్తుంది . అదే రోజు సినిమా లాంఛనంగా ప్రారంభిస్తారని ..ఈ సినిమాలో మొత్తంగా ఇద్దరు హీరోయిన్ ఫిక్స్ అయినట్లు క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది .

అందుతున్న సమాచారం ప్రకారం మొదటి హీరోయిన్గా రష్మిక మందన ఈ సినిమాలో నటిస్తుండగా ..రెండో హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది . కాగా రీసెంట్ గానే ఎన్టీఆర్ 30 లుక్ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ ను స్టైలిష్ క్లాసిక్ లుక్ లో చూసిన అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి . ప్రముఖ అడ్వర్టైజింగ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ ఫొటోను పంచుకున్నారు. మోనోక్రోమ్ పిక్చర్ లో బ్లాక్ సూట్ ధరించి, గ్లాసెస్ పెట్టుకొని తారక్ క్లాస్ గా అదరగొట్టారు. ప్రజెంట్ తారక్ చాలా స్టైలిష్ గా ఉన్న ఈ క్లాసిక్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మాన్ ఆఫ్ మాస్గా ఎన్టీఆర్ ను పిలిచే ఫ్యాన్స్ కు క్లాస్ లుక్ తోను అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఏది ఏమైనా సరే ఈ కొత్త లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest