ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలలో అవతార్ -2 సినిమా కూడా ఒకటి జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అవతార్కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం కోసం యావత్ ప్రపంచం ఎంత ఆసక్తికరంగా. 2009లో ఒక విజువల్ వండాన్ని సృష్టించిన జేమ్స్ కెమెరాన్ 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే తరహాలో విజువల్ వండర్ ని అవతారట్టుగా చూపిస్తున్నారు. ఊహకందని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అవతార్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సృష్టించింది.
ఇప్పుడు తాజాగా అవతార్-2 సంబంధించి ట్రైలర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ లో సముద్ర గర్భంలో ఊహకందని విజువల్స్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 16న భారీ స్థాయిలో త్రీడీ ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అమాంతం ట్రైలర్ విడుదలవడంతో మరింత పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే సముద్ర జీవితానికి అలవాటు పడిన జెక్ నేయిటీరి వారి కుటుంబం పిల్లలు చేసే విన్యాసాలు మనుగడ కోసం వారు పడే ఇబ్బందులు తమ తెగ వారి కోసం చేసే యుద్ధ విన్యాసాలు ప్రతి ఒక్కరిని అబ్బురపరిచేలా ఉన్నాయి.
ముఖ్యంగా అవతార్నిమించి అవతార్-2 ఉంటుందని సెకండ్ ట్రైలర్ లో క్లియర్ గా తెలియజేశారు. ఊహకందని విజువల్స్ పాత్రలలో విన్యాసాలు ట్రైలర్ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయికి చేరుకున్నాయి. కేవలం రెండు నిమిషాల నిడివి తో సాగిన ఈ ట్రైలర్ ప్రతిఫేము కూడా ఒక అద్భుతంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. 120 భాషలలో విడుదలవుతున్న ఈ సినిమా మన ఇండియా మొత్తం ఏడు భాషలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం 3d తోపాటు 4 డిఎక్స్ ఫార్మాట్లో కూడా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.