ఉత్తరాంధ్ర పోరు..34లో లీడ్ ఎవరికి?

ఈ రోజుల్లో ఏ అంశమైన అది రాజకీయం చుట్టూనే నడుస్తుంది. ప్రజలకు పనికొచ్చే పనులైన, పనికిరాని పనులైన సరే..దాని చుట్టూ రాజకీయ నడవాల్సిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అంశంపై..అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయం చేస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని..మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ఇటు ఒకటే రాజధాని అది కూడా అమరావతిని చెప్పి టీడీపీ రాజకీయం నడిపిస్తుంది.

మూడు రాజధానుల ద్వారా..ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో లబ్ది కోసం వైసీపీ, అమరావతి ద్వారా కోస్తాలో లబ్ది కోసం టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఈ రచ్చలో రాష్ట్రానికంటూ రాజధాని లేకుండా చేశారు. అయితే ఇక్కడ అమరావతి రైతులు, ప్రజలు..దాదాపు మూడేళ్ళ నుంచి అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇక వారిపై వైసీపీ ఎన్ని రకాల మాటల దాడి, చేతల దాడి చేసిందో చెప్పాల్సిన పని లేదు. పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఇంతకాలం నిలబడటం, పోరాటం చేయడం, పోలీసుల చేతులో తన్నులు తినడం చేయరు.

సరే ఏదొకవిధంగా అమరావతి కోసం పోరాడుతున్నారు..ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నారు. ఇక వీరిని ఉత్తరాంధ్రకు రాగానే అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇక వీరి పాదయాత్ర చేస్తున్నప్పుడే విశాఖ కోసం పోరాటం మొదలుపెట్టారు. జే‌ఏ‌సి పెట్టారు..రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. అలాగే టీడీపీ వారిని ఉత్తరాంధ్ర ద్రోహులు అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇటు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది..గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి మద్ధతుగా మాట్లాడిన వైసీపీ నేతల వీడియోలని ప్లే చేస్తున్నారు. ఇదే ధర్మాన ప్రసాద్ రావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం..గతంలో ఏం మాట్లాడారు..ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్రలో రెండు పార్టీల మధ్య రచ్చ జరుగుతుంది. ఇక వీరి పోరాటం అంతా ఉత్తరాంధ్రలో ఉన్న్ 34 సీట్లలో సత్తా చాటాడానికే. మరి చివరికి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు ఉంటారు..ఏ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెడతారో చూడాలి. మూడు రాజధానులు కావాలి అంటారో..అమరావతికి మద్ధతు ఇస్తారో ఎన్నికల్లో తేలిపోతుంది.