కుప్పంలో టీడీపీకి వైసీపీ ట్రైనింగ్..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కుప్పం పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలో లేక ఇతర ప్రోగ్రాంలు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో కుప్పం పేరు వినిపించేది. కానీ రాజకీయంగా రచ్చ జరిగినట్టు ఎప్పుడు వినబడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి అక్కడ రచ్చ నడుస్తోంది.

ప్రశాంతంగా ఉండే కుప్పంలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. అలాగే అధికార వైసీపీ అన్నీ రకాలుగా అక్కడ పైచేయి సాధిస్తూ వస్తుంది..అధికార బలంతో లోకల్ ఎన్నికలు గెలిచేసింది..ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుప్పం సీటుని గెలిచేస్తామని, కుప్పంలో చంద్రబాబుకు ఓటమి రుచి చూపిస్తామని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు. అలాగే కుప్పంలో టీడీపీని సరి చేసుకుందామని బాబు వెళితే..ఆయన పర్యటనలని కూడా వైసీపీ అడ్డుకుంటుంది. ఇలా కుప్పంలో రాజకీయ రచ్చ లేపుతుంది. అధికార బలంతో పూర్తిగా కుప్పంలో వైసీపీ హవా నడుస్తోంది.

అయితే ఇలా వైసీపీ చేయడం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ పరోక్షంగా వైసీపీ..టీడీపీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు బాబు అక్కడ ఏకపక్షంగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో కుప్పం టీడీపీ శ్రేణులకు గాని, బాబుకు గాని ప్రత్యర్ధులపై పోరాటం చేయాల్సిన అవసరం రాలేదు. కానీ తొలిసారి ఆ అవసరం వచ్చేలా చేసింది వైసీపీ. ఎప్పుడైతే వైసీపీ రాజకీయ యుద్ధం మొదలుపెట్టిందో అప్పటినుంచి బాబు అలెర్ట్ అయ్యారు..కుప్పంలో డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నారు.

ఇంకా చెప్పాలంటే అసలు పెద్దగా పోరాటం తెలియని కుప్పం టీడీపీ శ్రేణులకు..వైసీపీ పోరాటం ఎలా చేయాలో నేర్పించింది. దీంతో గత ఆరు నెలల నుంచి కుప్పం టీడీపీ శ్రేణులు కసితో పనిచేయడం మొదలుపెట్టారు. పైకి వైసీపీ హడావిడి చేస్తున్నా..బ్యాగ్రౌండ్‌లో టీడీపీ శ్రేణులు పనిచేసుకుంటూ వెళుతున్నారు. అలాగే వైసీపీ ఏమన్నా రచ్చ చేస్తే డానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చేలా టీడీపీ శ్రేణులు రెడీ అవుతున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.ఇక వారిపై టీడీపీ శ్రేణులు తిరగబడిన విషయం తెలిసిందే. మొత్తానికి కుప్పంలో టీడీపీ కార్యకర్తల్లో వైసీపీ పోరాట స్పూర్తిని రగులుస్తున్నారు.

Share post:

Latest