లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… నయనతార సినిమాలు మానేస్తుందా..!

సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార. ఇక ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా సినిమాలో నటిస్తూ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. నయనతార గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. నయనతార కేరళలో పుట్టి కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. నయనతార తాజాగా బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. ఈమె ఈ సినిమాతో అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది. న‌య‌న్‌ స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎన్నో ఇబ్బందులను కష్టాలను
అవమానాలను.. ఎంతో శ్రమపడి, తను అనుకున్న స్థాయికి ఎదిగింది.

నయనతార తన వ్యక్తిగత జీవితం పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. నయనతార జీవితం లో ఎన్నో ఎఫైర్లు కూడా ఉన్నాయి. నయనతార ముందు కోలీవుడ్ హీరో శింబు తో ప్రేమాయణంం నడిపింది. తర్వాత సౌత్ ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ప్రభుదేవా తో కూడా కొన్ని సంవత్సరాలు ప్రేమాయణం నడిపింది. ఇద్దరితో ప్రేమ‌లో ఉన్నప్పుడు నయనతార ఎంతో ఆవేదనకు మానసిక శోభకు గురైందట. ప్రేమ పెళ్లి అంటేనే భయపడి.. వాటి మీద విరక్తి చెంది. జీవితంలోనే పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిందట. కేవలం తన దృష్టి మొత్తం సినిమాల మీదే పెట్టింది.

Just-Married Couple, Nayanthara And Vignesh Shivan Meet The Media, Former  Radiates Bridal Glow

ఈ క్రమంలోనే దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ఆమె ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రేమలో ఉండి కొన్ని రోజులు పాటు సహజీవనం చేసి.. ఇటీవలే పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నయనతార పై ఒక ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. నయనతార పిల్లలు కావాలని కోరుకుంటుందట. నయనతార వయస్సు కూడా 30 సంవత్సరాలు దాటుతుంది.. సమయం మించి పోతుందని భావించినట్లు.. అందుకే తల్లి కావాలని కోరుకుంటున్నట్లు తన స్నేహితులతో చెప్పినట్లు సమాచారం. నయనతార త‌ల్లి అవ్వాలంటే తన నటనకు గుడ్ బై చెప్పాల్సిందే. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest