ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించిన వెంకీ మామ..!

వెంకీ మామగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యి అటు కామెడీ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ కూడా చేస్తున్నాడు.Venkatesh wraps Vishwak Sen Ori Devuda movie | cinejosh.com

ఈ క్రమంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా సినిమాల్లో వెంకటేష్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా కథని మలుపు తిప్పే కీలక పాత్రలో వెంకటేష్ 15 నిమిషాల పాటు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తమిళ భాషలో మంచి హిట్ అయిన ఓ మై కడువులే అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసి ఓరి దేవుడా అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళంలో తెరకేక్కించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు . ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడిగా మిథిలా పార్కర్ నటించింది. అంతేకాకుండా ఆశ భట్, మురళీ శర్మ , రాహుల్ రామకృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

అక్టోబర్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా వెంకటేష్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాధారణంగా సినిమాలలో హీరోగా నటిస్తే రూ.6 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటారు. అయితే ఈ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం ఐదు రోజులపాటు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోని ఈ ఐదు రోజుల షూటింగ్ కోసం ఆయన ఏకంగా రూ.3 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది మరీ ఎక్కువగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే పారితోషకం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించారు వెంకటేష్.

Share post:

Latest