అఖండను మించి వీర సింహారెడ్డి మ్యూజిక్… థియేటర్లో మోత గ్యారెంటీ..!

క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి రెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ సినిమాలో ఓవర మాస్ యాక్షన్ ఫైట్లతో మరోసారి టాలీవుడ్ ను షేక్ చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే థ‌మ‌న్‌ అఖండ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి సినిమా హిట్ అవ్వటంలో తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాలో కూడా అఖండను మించి మ్యూజిక్ ఉంటుందని తెలుస్తుంది. ఈ మ్యూజిక్ తో థియేటర్లు మోత మోగిపోతాయని కూడా అంటున్నారు.

ఈమధ్య వచ్చిన టీజర్ కూడా నందమూరి అభిమానుల‌ని ఎంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తమన్ ఆ మ్యూజిక్ జస్ట్ శాంపుల్ మాత్రమే.. సినిమాలో మ్యూజిక్ మరో లెవల్ లో ఉంటుందని.. థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్ గా విజిల్ వేసేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్ నందమూరి అభిమానులు మరింత జోషించింది. అఖండ సినిమాకు థ‌మ‌న్‌ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాలో కూడా థ‌మన్ తన మ్యూజిక్ తో అదరగొడతాడని తెలుస్తుంది. ఈ సినిమాతో థ‌మన్ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం థ‌మన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.