TRILER: అదరగొడుతున్న కార్తీ సర్దార్ ట్రైలర్..!!

టాలీవుడ్ లో క్రేజీ ఉన్న తమిళ హీరోలలో కార్తీక్ కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట యుగానికోక్కడు చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన కెరీయర్ని మొత్తం ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు కార్తీ. ఇక అన్న సూర్యకు తగ్గట్టుగా తమ్ముడుగా కార్తీ ఎన్నో విభిన్నమైన గెటప్పులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. తాజాగా సర్దార్ సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా ప్రమోషన్ చేస్తోంది. గతంలో విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

Karthi Starring Sardar Movie Trailer Released
ఇక ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మరింత హైప్ నెలకొంది. అయితే ఇందులో కార్తీ సరసన రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సర్దార్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు అనే డైలాగ్ తో మొదలవుతుంది. గెటప్పులలో కార్తి తన పాత్రకు తగ్గ న్యాయం చేశారని ఈ ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతోంది. ఒక మిలిటరీ ఆఫీసర్గా ,ఒక పోలీస్ ఆఫీసర్ గా కార్తి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఒకవైపు యువ హీరోగా మరొకవైపు ముసలి స్పై గా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు.

Karthi Starring Sardar Movie Trailer Launch Event To Happen At Forum Vijaya  Mall Today Evening | Sardar Trailer : பிரபல மாலில் நடைபெறும் சர்தார்  ட்ரைலர் வெளியீட்டு விழா
ఇక ఇండియన్ మిలిటరీ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే అసలు సర్దార్ ఎవరు అతను మారువేశాలలో తిరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయం తెలియాలి అంటే సర్దార్ సినిమా వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఈ చిత్రాన్ని తెలుగు వర్షన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నాగార్జున విడుదల చేయబోతున్నారు ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది.