ఆ స్టార్ హీరోయిన్ పై గుర్రుగా ఉన్న తెలుగు నిర్మాతలు.. కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో భర్త నుంచి విడిపోయి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన ఒక అందాల హీరోయిన్ ఆ తర్వాత కెరియర్ పరంగా అమాంతం స్పీడ్ పెంచేసింది. తెలుగు, హిందీ తో పాటు అనేక భాషల్లో భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతోంది.. ఒక్కరోజు కూడా సమయం ఖాళీ లేని బిజీ షెడ్యూల్స్ కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ ఇంతలోనే ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. అనుకోకుండా అమెరికాకు వెళ్ళిపోయింది. అయితే అందరూ ఏదో చిన్న ట్రిప్పు కోసం అని భావించారు. ఇక ఆమె రాక కోసం ఇక్కడ తెలుగు నిర్మాతలు కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఆమె రాక ఆలస్యం అవ్వడం, ఆలస్యం వల్ల తెలుగులో చిత్రీకరణ దశలో ఉన్న మూడు ప్రాజెక్టులు కాస్త ఇబ్బందికి ఎదుర్కొంటున్నాయని సమాచారం..

ఇకపోతే అమెరికా ట్రిప్ ముగించి తిరిగి పనిలో చేరేందుకు సదరు స్టార్ హీరోయిన్ కూడా ఇండియాకు తిరిగి వస్తోంది అని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈమె ఎందుకు అమెరికాకు వెళ్ళింది? అని అడిగితే అప్పటికే కమిట్ అయిన ఒక భారీ హిందీ వెబ్ సిరీస్ ని పూర్తి చేయడానికి వెళ్లి.. షూటింగ్ ముగించి తనకోసం ఎదురు చూస్తున్న తెలుగు నిర్మాతల కోసం ఇండియాలో అడుగు పెట్టబోతోంది. మరి 2 వారాల్లో హైదరాబాదుకు చేరి సినిమా షూటింగ్లలో పాల్గొనబోతుందని సమాచారం..ఇకపోతే తెలుగు నిర్మాతలు ఒక వైపు తమ సినిమాలను శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయాలని ఆలోచిస్తుంటే.. ఈ హీరోయిన్ మాత్రం బిజీ షెడ్యూల్ తో సహకరించడం లేదని ఆవేదన కూడా వ్యక్తం అవుతుంది.

త్వరలోనే అమెరికా షెడ్యూల్ ని ముగించుకొని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 3 తెలుగు సినిమాలో పనులను ముగించాల్సి ఉంటుంది ఈ హీరోయిన్. మరి ఈమె ఏ స్థాయి లో తెలుగు నిర్మాతలను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది..