రాజాలా బతికిన నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ..ప్రముఖ సినీ నటుడు రచయిత రంగనాథ్ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి పాత్రగల నటుడు మరెవరు లేరని కూడా చెప్పవచ్చు దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించిన ఈయన హీరోగా విలన్ గా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక రంగనాథ్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేవట కానీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని విషయం ఇప్పటికీ మిస్టరీ గాని మిగిలిపోయింది.

Telugu actor Ranganath commits suicide
రంగనాథన్ కు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకి దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఓపిగ్గా అన్ని పనులు చేశారు రంగనాథ్. ఇక ఆమె మృతి తర్వాత రంగనాథ్ ఒంటరితనానికి గురయ్యారు అనే వార్తలు బాగా వినిపించాయి ఈ కారణంగానే డిప్రెషన్కు గురై ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రంగనాథన్ ఇండియన్ రైల్వేలో టిసి గా కూడా ఉద్యోగం చేశారు. ఇక ఆ తరువాత 1969 లో బుద్ధిమంతుడు సినిమా ద్వారా తను సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత 1974లో వచ్చిన చందన అనే సినిమాతో హీరోగా మారిపోయారు .

ఆ తర్వాత జమీందారు గారి అబ్బాయి, పంతులమ్మ, రామచిలుక, శ్రీరామదాసు ,అడవి దొంగ, ఖైదీ, వేట తదితర సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించారు రంగనాథ్. ఇక ఈయన నటనతో తెలుగువారి ప్రేక్షకులలో మరిచిపోలేని ముద్ర వేసుకున్నారు. కానీ ఈయన మరణ వార్త మాత్రం ఇప్పటికీ ఈయన అభిమానులను కలిచి వేస్తోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇప్పటికీ రంగనాధ్ మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఈ నటుడే కాకుండా కొంతమంది సినీ సెలబ్రిటీ మరణాలు కూడా మిస్టరీగానే మిగిలిపోయాయి.

Share post:

Latest