అన్ స్టాపబుల్ షో హిట్ అవ్వడానికి మూల కారణం అదే .. కర్త-కర్మ-క్రియ అన్ని ఆమె.. !!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. మనకు తెలిసిందే ఆహా ఓటీటీ లో ఎవ్వరు కని విని ఎరుగని రీతిలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా పరిచయం చేస్తూ ఓ టాక్ షో ను ప్రారంభించారు . అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సీజన్లో రవితేజ, గోపీచంద్ మల్లినేని, రాజమౌళి, సుకుమార్, బన్నీ, బోయపాటి శ్రీను, మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్ వచ్చి సందడి చేసి బాలయ్య తో సరదాగా ముచ్చటించారు ,

బాలయ్య కూడా తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ.. వార్నింగ్ ఇస్తూ.. సలహాలు ఇస్తూ గెస్ట్ లతో సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. అంతేకాదు ఎవ్వరు ఊహించని విధంగా కనీ విని ఎరుగని రీతిలో టిఆర్పి రేటింగ్ సంపాదించుకొని ఓటీటీలోనే నెంబర్ వన్ టాక్ షోగా అన్ స్టాపబుల్ రికార్డులు బద్దలు కొట్టి ..సరికొత్త సంచలన రికార్డును సృష్టించింది . ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు . కాగా భారీ అంచనాల నడుమ అన్ స్టాప్బుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది .

అయితే అన్ స్టాపబుల్ షో ఇంతటి హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్పాంటేనిటీ. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం.. నిజాయితత్వం.. అన్ని షోస్ లాగా ముందుగానే స్క్రిప్ట్ వర్క్ ఇవ్వరు. గెస్ట్లు చెప్పిన ప్ర్శ్నలనే అడగాలని హోస్ట్లుకకు రూల్స్ పెట్టరు. స్పాంటేనియస్ గా బాలయ్యకు ఏది అడగాలనిపిస్తే అది అడగడం జనాలకు విపరీతంగా నచ్చింది . మరీ ముఖ్యంగా ఈ షోకి బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వడానికి మూల కారణం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అంటూ తెలుస్తుంది . బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్విని ఈ షో కి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు . ఆమె తన తండ్రి లుక్స్ ,కాస్ట్యూమ్స్ వంటి విషయాలపై చాలా రీసెర్చ్ చేసి.. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ముందుకు అల్ట్రా స్టైలిష్ బాలయ్యను తీసుకువచ్చింది. అంతే కాదు స్క్రిప్ట్ పరంగా కూడా తేజస్విని సూపర్ ఐడియాస్ ఇస్తూ ఆహావారికి సబ్స్క్రైబర్లు పెరిగేందుకు సలహాలు ఇస్తుంది. అంతెందుకు ఈ షో కోసం తేజస్వినీ ఏ విధంగా కష్టపడిందో డైలాగ్ రైటర్ బీవీఎస్​ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో కర్త కర్మ క్రియ అన్ని తేజస్విని అంటూ న్యూస్ ఫైనల్ గా మారింది.