ఆ కార‌ణం వ‌ల్లే మా ఆస్తి అంతా క‌రిగిపోయింది.. నటి తులసి ఆవేద‌న‌!

బాలనటిగా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన తులసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె వరస సినిమాలతో బిజీగా మారిపోయారు. తెలుగు సినిమాల నుండి మంచి ఆఫర్లు రావడం కారణంగా ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అనేక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రస్తావించారు.


అయితే తులసి అమ్మగారికి మహానటి సావిత్రి గారి తో అలాగే అంజలీదేవి గారితో మంచి స్నేహానుబంధం ఉండేదట. అలా తరచూ తులసి వారి ఇంటికి కూడా వెళ్లేవారట. అలా తులసీని చూసిన సావిత్రి గారు బాలనటిగా పరిచయం చేయమని వారి అమ్మగారిని ఒత్తిడి చేయడం కారణంగా వారి అమ్మ గారు కూడా తులసిని నటన వైపుకు నడిపించడానికి ఉత్సాహాన్ని చూపించారట.


అయితే తులసి చిన్నప్పుడే వారి నాన్నగారు చనిపోయారట. వారి అమ్మగారి మంచితనం కారణంగా రెంట్ కూడా కట్టకుండా వారి ఇంట్లో కొంతమంది సినిమా వాళ్లు అద్దెకు ఉండేవారట. ఇంట్లో ఏ వంట చేసిన ఆ వీధిలో ఉన్న వారందరికీ పంచేసేవారట. ఇరుగుపరుగు వారెవరైనా స‌రే అది బాగుంది అంటే అది ఎంత ఖరీదైన సరే వెంటనే అది వారికి ఇచ్చేసేవారట. అమ్మ అతి మంచితనం కారణం వల్లే తమ ఆస్తి అంతా కూడా కరిగిపోయిందంటూ తులసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ కారణంగానే ఫ్యాషన్ తో నటన వైపు వెళ్ళిన తనకు.. ఆ తరువాత నటనే అవసరమైపోయిందంటూ తులసి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు.

Share post:

Latest