మిల్కీ బ్యూటీ అందాల విందు… పరువాలతో కుర్రాళ్లను చెడగొడుతున్న తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లను అడిగితే తడుముకోకుండా చెబుతారు, అందానికి నిలువెత్తు నిదర్శనం అని. అవును, తెలుగు పరిశ్రమలో అందంతోపాటు నటన, డాన్స్ తో తనదైన మార్క్ వేసింది తమన్నా. తెలుగు పరిశ్రమకి వచ్చి 15 ఏళ్ళు దాటుతున్నా ఇంకా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళ్తోంది మన మిల్కీ బ్యూటీ. మొదటి సినిమా ‘హ్యాపీ డేస్’తోనే అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.

ఈ క్రమంలో చిన్న హీరోలతో మొదలుకొని పెద్ద పెద్ద స్టార్లతో కూడా ఈమె సినిమాలు చేసింది. 100% లవ్, కెమెరా మేన్ గంగతో రాంబాబు, ఊసరవెల్లి సినిమాలు ఆమెకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘బోళా శంకర్’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఓ రకంగా ఇపుడు సీనియర్ హీరోలకు అమ్మడు ప్రత్యామ్నాయంగా మారింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతోపాటు తమన్నా ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే ఎంత బిజీగా వున్నా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

తాజాగా అమ్మడు రెడ్ ట్రెండీ వేర్ ధరించిన గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫ్లాట్ అయిపోతున్నారు. తమన్నా లేటెస్ట్ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బి. సెప్టెంబర్ 30 నుండి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. సదరు డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన తమన్నా సెక్సీ ఫోజులతో కుర్రాళ్లను కవ్వించారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు.

Share post:

Latest