ఇద్దరు ‘రాజా’లకు తమ్ముళ్లే ప్లస్..!

రాష్ట్రంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుందనే విషయంలో వాస్తవం లేకుండా లేదు. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. అలాగే ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత ఉంది. అలా అని వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోయిందా? అంటే పూర్తిగా తగ్గలేదు గాని..కొంత వరకు తగ్గింది. అయినా టీడీపీ కంటే వైసీపీనే లీడ్‌లో ఉంది. అలా ఉండటానికి కారణం టీడీపీ పూర్తిగా పికప్ కాకపోవడమే.

ఇలా టీడీపీ పుంజుకోకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ప్లస్ ఉంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల..మళ్ళీ కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచేలా ఉన్నారు. టీడీపీ నేతలే వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతుంది. అలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తుని, రాజానగరం స్థానాల్లో..టీడీపీ నేతలే వైసీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అవుతున్నారు. తుని అంటే ఒకప్పుడు  టీడీపీ కంచుకోట గాని..2009 నుంచి ఇక్కడ టీడీపీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు.

చెప్పాలంటే ఇప్పుడు ఆయనపై పెద్ద పాజిటివ్ లేదు..కానీ తునిలో యనమల ఫ్యామిలీపై నెగిటివ్ ఉంది. యనమల రామకృష్ణుడు గాని, యనమల కృష్ణుడు గాని నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచడం లేదు. మళ్ళీ యనమల కృష్ణుడు బరిలో దిగితే..విజయం దాడిశెట్టిదే. అంటే తునిలో టీడీపీ పరిస్తితి అలా ఉంది.

ఇటు రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కూడా టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ ప్లస్ అవుతున్నారు. అక్కడ రాజాకు కూడా అనుకున్నంత ప్లస్ లేదు. పైగా అక్రమాలు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే ఇక్కడ టీడీపీ నేత పెందుర్తి బలంగా లేకపోవడం వల్ల జక్కంపూడి రాజాకు ప్లస్ అవుతుంది. తాజాగా చంద్రబాబు..వెంకటేష్‌కు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. సరిగ్గా పనిచేయడం లేదని, ఇలాగే ఉంటే మార్చేస్తానని అన్నారు. అంటే వెంకటేష్ పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాగే చేస్తే నెక్స్ట్ కూడా రాజానే గెలిచేలా ఉన్నారు.