కావలిలో ప్లస్..బరిలో నిలిచేదెవరు?

అసలు నెల్లూరు జిల్లా అంటేనే టీడీపీకి కలిసిరాని జిల్లా..ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకున్నంత ప్లస్ ఉండదు. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద కలిసిరాలేదు. అలా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాల్లో కావలి కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే కావలిలో టీడీపీ గెలిచింది. 1983, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది.

ఇక గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు పోటీ చేసి దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019లో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసి 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే నెల్లూరు జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ మెజారిటీనే వచ్చింది. కావలిలో మాత్రం 14 వేల సాధారణ మెజారిటీ వచ్చింది. అంటే కావలిలో టీడీపీకి ఇంకా బలం ఉందని అర్ధమవుతుంది.

అయితే ఓడిపోయాక విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో యాక్టివ్ గా లేరు. అటు బీదా మస్తాన్ రావు టీడీపీని వదిలేసి వైసీపీలోకి వెళ్లారు. దీంతో కావలిలో  టీడీపీ బలం తగ్గినట్లు కనిపించింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హవా స్పష్టంగా సాగింది. స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచేసింది. ఇక కావలిలో టీడీపీకి సరైన నాయకుడు కనిపించలేదు. పైగా బీదా రవిచంద్రయాదవ్‌ని ఇంచార్జ్ పదవి తీసుకోమన్న తీసుకోలేదు. దీంతో పార్టీకి కష్టాలు కొనసాగాయి.

ఇదే క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడుని ఇంచార్జ్‌గా ప్రకటించారు. లోకల్ నాయకుడుగా సుబ్బానాయుడుకు కాస్త పట్టుంది. ఇంచార్జ్ అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేయడం, బీదా రవి సపోర్ట్‌ తీసుకుని, పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. దీంతో కావలిలో టీడీపీ బలం పెరుగుతూ వస్తుంది. అటు కావలి అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని ఎమ్మెల్యే ప్రతాప్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఇటీవల సర్వేల్లో కూడా కావలిలో వైసీపీ గెలుపు కష్టమని తేలింది. అయితే టీడీపీ ఇంకా కష్టపడాల్సి ఉంది. అప్పుడే కావలిని కైవసం చేసుకోగలరు. కాకపోతే సుబ్బనాయుడుకే సీటు ఇస్తారా? లేక వేరే నేతని పెడతారనేది క్లారిటీ రావడం లేదు.