హీరోయిన్ తో సందీప్ డీప్ లిప్ కిస్..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటోలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పేరు కి యాక్షన్ సినిమా అయినా సరే ఖచ్చితంగా ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కానీ లిప్ కిస్ సీన్స్ కానీ ఉండాల్సిందే. అలా ఉంటూ బీప్ సౌండ్ పెడితే ఆ సినిమా హిట్ అయిపోతుంది. అదో పిచ్చి నమ్మకం డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ లో నెలకొంది. అందుకే ఎలాంటి హీరో అయినా సరే అది చిన్న హీరో కానివ్వండి పెద్ద హీరో కానివ్వండి ..ఎలాంటి సినిమా అయినా సరే యాక్షన్ సినిమా కానివ్వండి ..ఫ్యామిలీ డ్రామా సినిమా కానీ ఇవ్వండి.. కచ్చితంగా ఆ సినిమాలో కిస్సింగ్ ఉండాల్సిందే . బోల్డ్ కంటెంట్ సీన్ కనీసం రెండు నిమిషాలైనా పడాల్సిందే .

అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుందని జనాల్లో.. మేకర్స్ లో.. ఓ నమ్మకం ఏర్పడింది. కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా సందీప్ కిషన్ కెరియర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “మైఖేల్” అనే సినిమాకు సంబంధించిన పోస్ట్ర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఎవరు ఊహించని విధంగా హీరో సందీప్ కిషన్ హీరోయిన్తో ఘాటైన లిప్ లాక్ చేస్తూ ఆ పోస్టర్ లో కనిపిస్తాడు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సందీప్ కిషన్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది .

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఎవరో కాదు నాగచైతన్య మజిలీ సినిమాలో హీరోయిన్గా నటించిన దివ్యాంకా కౌశిక్. డైరెక్టర్ జయకోడి ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను రిలీజ్ చేసారు. ఇందులో భాగంగా హీరో హీరోయిన్లు మధ్య స్పైసీ కిస్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 28 విడుదల చేయనట్టు తెలిపారు . దీంతో ఒక్కసారి మీడియాలో సందీప్ స్పైసీ లిప్ లాక్ ట్రెండింగ్ గా మారింది.