RGV క్లారిటీ ఇచ్చేసాడు… AP రాజకీయ కుట్రల నేపథ్యంలో “వ్యూహం” సినిమా!

అవును, అనుమానం నిజమైంది. నిన్న YS జగన్‌ను దర్శకుడు వర్మ తాడేపల్లిలో కలవడం పలు అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో త్వరలో రాజకీయాలపై ఆర్జీవీ సినిమా తీయబోతున్నారు అంటూ క్షణాల్లో రూమర్స్ వెల్లువెత్తాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ వర్మ ఓ ట్వీట్ చేసారు. దాంతో అందరి ఊహాగానాలు నిజమని తేలింది. ఇక జగన్‌‌కు అనుకూలంగా ఆర్జీవీ సినిమా తీయబోతున్నాడా, వ్యతిరేకంగా సినిమా తీయబోతున్నాడా అనేది ఇంకా తెలియాల్సి వుంది.

వర్మ తన ట్వీట్లో తాను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నానని చెప్పుకొచ్చారు. ఇది బయోపిక్ కాదని.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని అందులో పేర్కొన్నారు. బయోపిక్ లో అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో 100% నిజాలే ఉంటాయని తెలిపారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిందే “వ్యూహం” కథ అని రాసుకొచ్చారు. అలాగే ఇది పూర్తిగా రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని కూడా అన్నారు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం అని ట్వీట్ ని ముగించారు.

ఇకపోతే ఈ చిత్రం 2 భాగాలుగా రాబోతుందని వర్మ అన్నారు. మొదటి పార్ట్ టైటిల్ “వ్యూహం” అయితే రెండో పార్ట్ టైటిల్ “శపథం” అని నామకరణం చేసారు. ఇక ఈ రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తెరుకునే లోపే.. శపథం రూపంలో ఎలెక్ట్రిక్ షాక్ తగులుతుందని బల్లగుద్ది మరీ తెలిపారు. కాగా ఈ ట్వీట్ కి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘పీకావులే తీ’ అని ఒకరంటే, ‘ని సినిమా Paytm బ్యాచ్ కూడా చూస్తారో లేదో డౌటే’ అని ఒకరు, ‘నివ్వు ఇలాంటి సినిమాలు తీస్తూనే బతకాలి’ అని ఇంకొకరు.. ఇలా ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.