అబ్బో ఆదిపురుష్ టీజర్‌తోనే ఇన్ని రికార్డులా… ద‌టీజ్ ప్ర‌భాస్ మానియా…!

బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తర్వాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

Adipurush teaser out. Prabhas' Lord Ram goes all out to battle Saif Ali Khan's 10-headed Lankesh - Movies News

తాజాగా అయోధ్యలో నిన్న రాత్రి ఆదిపురుష్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ టాక్ వచ్చినా బాలీవుడ్ లో ఈ టీజర్ ఎవరు ఊహించని రికార్డులను సృష్టిస్తుంది. హిందీలో అత్యధిక వ్యూస్, లైకులు దక్కించుకోవడానికి ఆదిపురుష్ కి కేవలం 16 గంటల సమయం పట్టింది. ఈ టీజర్ కి ఏకంగా 933k కంటే ఎక్కువ లైకులు వచ్చాయి.. ఈ టీజ‌ర్ 56 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది.

ఇక దీంతో ఆదిపురుష్ హిందీలో రిలీజ్ అయిన టీజర్‌ల‌ కంటే అత్యధిక లైక్లు.. వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కీలకపాత్రల‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను టి సిరీస్, రెట్రో ఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ చేస్తున్నారు.

Share post:

Latest