పవన్ కళ్యాణ్ మూడ్ దొబ్బింది.. ఇప్పుడు ఆ ఇంట్రెస్టే లేదట..!?

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాల్లో చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తనదైన స్టైల్ లో సినీ పాలిటిక్స్ చేస్తూ,, అటు సినిమాలల్లోను ఇటు రాజకీయాలల్లోను రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ తగ్గించేశాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న టైం లో టోటల్ కాన్సన్ట్రేషన్ రాజకీయాలపై పెట్టాలి అని అనుకున్న పవన్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు.

ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేసి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలని .. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఎప్పుడో ఆగిపోయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను మళ్ళీ ప్రారంభించాలని సర్వం సిద్ధం చేసుకున్నాడు . దీంతో డైరెక్టర్ క్రిష్ కూడా సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన పనులను పూర్తి చేసుకున్నాడు . అయితే రీసెంట్గా విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చారో చూసిందే.

Pawan Kalyan sympathises injured Jana Sena workers, to hold a press meet in  a while

ఓ రేంజ్ లో ఊగిపోతూ ..నా కొడకల్లారా అంటూ వైసిపి లీడర్స్ ని ఏకిపారేశాడు . అంతేకాదు తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడిన వాళ్లందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతేకాదు రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ ఇదే రేంజ్ కంటిన్యూ చేస్తే సీఎం అవ్వడం పక్క అంటూ జోశ్యం చెప్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Hari Hara Veera Mallu to resume soon!

ఇలా రాజకీయాల్లో వేడి పుట్టించిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు సినిమా చేసే మూడ్ లేదట . అందుకే కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని.. ప్రజెంట్ చేస్తున్న సినిమాలు అన్నిటికీ బ్రేక్ వేయాలని ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ నవ్వాలో ఏడవాలో తెలియక ఉండిపోయారు. సినిమాలకు దూరం అవుతున్నారని బాధపడాలో ..రాజకీయాలకు దగ్గరవుతున్నారని సంబరపడాలో.. తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఉండాలి అంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ ఆయనకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు . మరి చూడాలి పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్తాడా..? లేకపోతే రాజకీయాలలో తన రిజల్ట్ చూసి సినిమాల్లోకి వస్తాడా..? ఏమో పవన్ ఎలాంటి అనుసరిస్తాడో చూద్దాం..!!