T20 WORLD CUP 2022: పాకిస్తాన్ ఇంటికే…!

టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ రేస్ నుంచి ఇంటికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు ఓటములు తరువాత.. పాక్ సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన పాకిస్తాన్- జింబాబ్వే మ్యాచ్‌లో ఎవరు ఊహించిన విధంగా జింబాబ్వే- పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఇక దీంతో గ్రూప్. బి లో ఉన్న జట్లలో సెమీఫైనల్ ఫైట్ చాలా ఆసక్తికరంగా మారింది.

ఇండియా- జింబాబ్వేలతో ఓటమి పాలైన పాకిస్తాన్.. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలలో 0 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన టీమ్‌లు భారత్- దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ -జింబాబ్వేలు పాకిస్తాన్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఇక టీమిండియా రెండు మ్యాచ్ గెలవడంతో నాలుగు పాయింట్లతో ఉండగా.. జింబాబ్వే- దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్లలో విజ‌యం సాధించి మూడు పాయింట్లు సంపాదించుకున్నాయి. బంగ్లాదేశ్ రెండు పాయింట్లుతో మూడో స్థానంలో నిలిచింది.

What are the chances for Pakistan to qualify for T20 WC semifinal?

పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరుకోవాలంటే గ్రూప్ బి లో ఉన్న మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంది. ఇక పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోను పాకిస్తాన్ కచ్చితంగా భారీ స్కోరుతో విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ భారీ స్కోర్‌తో విజయం సాధించకపోతే నెట్ రేట్ పెరగకపోవడంతో పాకిస్తాన్ ఇంటికి వెళ్లి పోయే ఛాన్సులు ఎక్కువగా క‌నిపిస్తున్నాయి.