మరొకసారి ఎమోషనల్ పోస్టు చేసిన నయనతార భర్త..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ పేరుపొందింది నయనతార. అయితే దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా విగ్నేష్ అనే డైరెక్టర్ని ప్రేమించి జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే అక్టోబర్ 9వ తేదీన వీరికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని విరు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.దీంతో వీరు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ఇలా సరోగసి పద్ధతిలో పిల్లలు కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.

Surrogacy row: Nayanthara-Vignesh Shivan say their marriage was registered  6 years ago
ఈ విషయంపై అటు ప్రజలే కాకుండా సినీ ప్రముఖులు కూడా చాలా మండిపడుతున్నారు.దీంతో ఈ వివాదంపై విచారణ చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వివాహమైన నాలుగు నెలలకె పిల్లలు ఎలా పుట్టారనే వివరణ ఇవ్వాలంటూ నయన్ దంపతులకు నోటీసులు జారీ చేయడం జరిగినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ ఇష్యూ పై విచారణ జరిపేందుకు కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా నయనతార భర్త విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్లు సమాచారం.

ఇక ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో విజ్ఞేశ్ స్పందిస్తూ అన్ని విషయాలను సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు కాస్త ఓపిక పట్టండి అంటూ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా కష్ట సమయంలో ఉన్నప్పుడు మీకు ఏది అవసరయో చెప్పే వ్యక్తులు మాట మాత్రమే వినండి అంటూ తెలియజేశారు. విగ్నేష్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది. విగ్నేష్ చేసిన పోస్టులు సరోగసి వివాదం గురించి అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నయనతార తమ పిల్లలకు జన్మనిచ్చిన మహిళా మాత్రం దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం విగ్నేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest