“ది ఘోస్ట్” ప్రీమియర్ రివ్యూ: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..!!

అక్కినేని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి సోనాలి చౌహాన్ నటించింది. కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది . కధ పరంగా బాగున్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తనదైన స్టైల్ లో షాకింగ్ ట్వీస్ట్లు పెడుతూ తెరకెక్కించినా కానీ.. సినిమా ఫస్ట్ హాఫ్ లో సుత్తు కొట్టించేశాడు. సినిమా మొత్తానికి ఎక్కడో ఒకచోట ఒక మైనస్ పాయింట్ కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున నటించిన “ది ఘోస్ట్” సినిమా కొన్ని పాజిటివ్ టాక్స్ ..కొన్ని నెగటివ్ టాక్స్ మధ్య థియేటర్లో బొమ్మ పడ్డింది.

మొదటి నుంచి డైరెక్టర్ చెప్పినట్టు ఇది ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ . అదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ..అదే లవ్ స్టోరీస్.. అదే రొమాంటిక్ సీన్స్ కథలు చూసి విసుగెత్తిపోయిన తెలుగు జనాలకు ఇది నిజంగా మైండ్ రీఫ్రెష్ మెంట్ మూవీ అని చెప్పాలి. ఒక్కవేళ్ల మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్ట పడే వాళ్లు అయితే .. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకోలేదు . ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ..ఇంట్రెస్టింగ్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ ట్వీస్ట్ లు ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే కచ్చితంగా మీకు ఈ సినిమా సూపర్ గా నచ్చుతుంది. అంతేకాదు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనాలి .

ఆఫ్ కోర్స్ నాగార్జున ఎవర్ గ్రీన్ యాక్టర్. ఆ విషయంలో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకి మరో ప్లస్ పాయింట్ సోనాలి చౌహన్ అందాలు. ఇంటర్ పోల్ ఆఫిసర్ గా సోనాలి తన అందాలను ఆరబోస్తూనే ..ఎక్కడ ఎం చూపించాలో అవి చూపించి.. సినిమాకి మంచి బూస్టాప్ ఇచ్చింది . ఓవరాల్ గా సినిమా మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగానే వచ్చినా..అక్కడక్కడ స్లో నెరేషన్ కారణంగా కొంచెం తడబడింది “ది ఘోస్ట్”.

అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల యాక్షన్ సీన్స్ ఎపిసోడ్స్. థియేటర్స్ లో ఆ యాక్షన్ సీన్స్ ఎపిసోడ్ వచ్చేటప్పుడు జనాలు నరాలు తెగిపోయేలా ఉన్నాయి. అంతేకాదు క్లైమాక్స్ సీన్ అద్భుతంగా రాసుకున్నాడు. మరి ముఖ్యంగా నాగర్జున సోనాలి చౌహాన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ టైంలో థియేటర్స్ అరుపులు కేకలతో థియేటర్ దద్దరిల్లిపోతుంది . ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే నాగార్జున స్క్రీన్ ప్రజెన్స్.. యాక్టింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ టేకింగ్ అదిరిపోయింది.

కొరియోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ సూపరో సూపర్ అంటూ రివ్యూ ఇస్తున్నారు . అయితే ఎంత పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన నాగార్జున స్టార్ డమ్ తగ్గిపోయింది. ప్రజెంట్ హీరోలతో కంపేర్ చేస్తే నాగార్జున కొంచెం వెనకడుగులోనే ఉన్నారు. అందుకే సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా ..100 కోట్ల క్లబ్ లో అయితే చేరలేదు అంటున్నారు జనాలు. దీంతో చచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్నం.. సీనియర్ హీరో సినిమాకి వచ్చిందే లాభాలు అంటూ జనాలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు .మరి చూడాలి “ది ఘోస్ట్” ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో..?