షారుఖ్ కొడుక్కి తలపొగరంటున్న నెటిజన్లు… విషయం ఇదే!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మనోడు ఇంకా సినిమాలలో నటించకుండానే ఆమధ్య డ్రగ్స్ వివాదం వలన యావత్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఆ విషయం ప్రస్తుతం పక్కన బెడితే, మరో సారి ఆర్యన్ ఖాన్ తలపొగరు చూపించాడని నెట్టింట జనాలు అనుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరలా న్యూస్ అయ్యాడు. ఎదురుగా ఉన్న ఓ సెలబ్రీటీని.. లెక్క చేయకుండా పొగరుగా వెళ్లిపోవడంతో.. విమర్షలపాలు అయ్యాడు.

విషయంలోకి వెళితే, ఈమధ్య లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యింది హీరోయిన్ అనన్య పాండే. సినిమా రిజల్టు ఎలాగున్నా అమ్మడుకి మంచి మార్కులే పడ్డాయి. ఆర్యన్ ఖాన్ విషయానికొస్తే తండ్రి స్టార్ డమ్ తో ఆర్యాన్ ఖాన్ తలబిరుసు ప్రదర్శిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆమధ్య కాలంలో అనన్య పాండే ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అంటూ మనసులో మాట చెప్పుకొచ్చింది. మరి ఆ మాట వాడికి తెలిసిందేమోగాని తాజాగా అనన్య పాండే ఎదురుగా ఉన్నా, ఏమి పట్టనట్టు ఆర్యన్ ఖాన్ చూసీ చూడనట్టు వెళ్ళిపోయాడు.

అదిగో అక్కడే వచ్చింది అసలు చిక్కి. ఈ విషయమై అనన్య ఫీల్ అవ్వకపోయినా, నెటిజన్లు మాత్రం చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అంత అందమైన భామ ఎదురుగా ఉంటే, ఏమి ఎరగనట్టు పక్కకు తప్పుకుని మరీ పొగరుగా వెళ్ళాడు ఏంటి? కనీసం పలకరించలేదు! అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో యేసుకుంటున్నారు. షారుఖ్ కొడుక్కి ఇంత బలుపేంటి? అని కొందరంటే, తండ్రిని చూసి, ఒదిగి ఉండటం నేర్చుకో అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.