ఉల్లిపొరల శారీలో కృతి సనన్ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారు… ఇది అన్యాయం!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. కాగా ఆ చిత్రం నిరాశ పరచడం వలన కృతికి ఇక్కడ ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితేనేం, కృతి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం విశేషం. తెలుగులో తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్ళు, మెరుపు తీగలాంటి వదనంతో కృతి సనన్ అచ్చం అరేబియన్ గుఱ్ఱంలాగా ఉంటుంది. బేసిగ్గా మోడల్ కాబట్టి నాజూగ్గా అందాలు ఎలా మైంటైన్ చేయాలో ఆమెకి బాగా తెలుసు. ఆమె ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానులకు అతి దగ్గరగా ఉంటుంది. అప్పుడప్పుడు కృతి సనన్ షేర్ చేసిన ఫోటోలు బాలీవుడ్ కుర్రాళ్ళకే కాదు, టాలీవుడ్ కుర్రాళ్లకు కూడా కునుకులేకుండా చేస్తుంటాయి.

అవును, ఆమె తాజాగా ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో తీసుకున్న హాట్ ఫోటోలు సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్నాయి. కొంగు చాటు దాగున్న అందాలు చూపిస్తూ, ఊరిస్తోంది. కాగా ఈ టాల్ బ్యూటీ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే, బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం అనే చెప్పుకోవాలి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కృతి సనన్ ఇందులో సీతా దేవిగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.

Share post:

Latest