కేశినేని బ్రదర్స్ పాలిటిక్స్..చిన్ని కొత్త ఎత్తు.?

విజయవాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ముఖ్యంగా టీడీపీలో నడిచే గ్రూపు తగాదాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి. మొదట నుంచి ఇక్కడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు నానికి…బుద్దా, బోండా ఉమా, దేవినేని ఉమా అంటే పడని పరిస్తితి..వారిపై డైరక్ట్‌గానే విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి..వారు కూడా నాని టార్గెట్ గా విమర్శలు చేశారు.

ఇక నానికి వాళ్లతోనే కాదు..సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని)తో కూడా విభేదాలు ఉన్నాయని ఆ మధ్య తేలింది. నానికి చెక్ పెట్టడానికి విజయవాడలో చిన్నిని టీడీపీ అధిష్టానం పైకి లేపుతుందని..నాని గతంలోనే విమర్శలు చేశారు. అలాగే తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కారుని తన సోదరుడు వాడుతున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనికి చిన్ని కూడా వివరణ ఇచ్చారు..తాను అన్న  ఎంపీ స్టిక్కర్ వాడటం లేదని, అలాగే టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే..ఏదైనా చేస్తానని చెప్పుకొచ్చి సైలెంట్ అయ్యారు.

అయితే ఇటీవల చిన్ని మళ్ళీ యాక్టివ్ అయ్యారు..విజయవాడ పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం చేస్తున్నారు. అది కూడా నానికి పడని బుద్దా, బోండా, దేవినేనిలతో కలిసి పనిచేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. అటు రూరల్ ప్రాంతాల్లోని గ్రామాల్లో పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అసలు ఎంపీగా తన అన్న నాని ఉండగా, పార్లమెంట్ పరిధిలో చిన్ని సెపరేట్ గా కార్యక్రమాలు చేయడంపై  రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

ఎంపీ సీటు దక్కించుకోవడం కోసమే చిన్ని ఈ విధంగా ముందుకెళుతున్నారని, పైగా నానికి యాంటీగా ఉన్నవారితో చేతులు కలిపి పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇలా చిన్ని ఎంపీ సీటుపై గురి పెట్టి పనిచేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో నానికి ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇస్తారా? అనేది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఆయన విజయవాడ వెస్ట్ ఇంచార్జ్‌గా ఉన్నారు. కానీ జనసేనతో పొత్తు ఉంటే ఆ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి నాని-చిన్నిల మధ్య సీటు విషయంలో పెద్ద రచ్చ జరిగేలా ఉంది.