Ps-1 చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..!!

కోలీవుడ్ లో తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన ప్రతిరోజుకి వివాదం పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే రజనీకాంత్, ఖుష్బూ కంటి వారికి కూడా ఈ సినిమా పైన స్పందించారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ కూడా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు చోళ రాజులు హిందువులు కాదంటూ కమల్ హాసన్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వం అనేది లేదని అప్పట్లో హిందూ మతం అసలు లేదని.. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని తెలియజేశారు.

Politics is personal for me: Kamal Haasan interview | Entertainment  Interview | English Manorama
కేవలం మనదేశంలో బ్రిటిష్ వారు అడిగిపెట్టిన తర్వాతనే మనల్ని ఎలా పిలవాలో తెలియక అప్పుడు వారు హిందువులని సంబోధించారని కమలహాసన్ తెలియజేశారు. కలలకు భాష, కులం మతం లేదని వీటి ప్రతిపాదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదని విషయాన్ని తెలియజేశారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా ఈ చిత్రం ప్రజలు ఆదరించలేదంటూ వివాదం సృష్టిస్తున్నారని అది తగువు కాదని.. తమిళులు ,తెలుగు సినిమా శంకరాభరణం ఆదరిస్తే తెలుగు వారు కోలీవుడ్ సినిమా మరోచరిత్రను బాగా ఆదరించారని తెలియజేశారు కమలహాసన్.

I feel proud after watching Ponniyin Selvan : Kamal Haasan - Only Kollywood

అసలు ఏ సినిమాకైనా భాషతో సంబంధం లేదని ఏ భాషలోనైనా సినిమా బాగా ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని కమలహాసన్ తెలియజేశారు. మణిరత్నం ఎంతో ఇష్టపడి తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఇందులో విక్రమ్, త్రిష, కార్తీ , ప్రకష్ రాజ్, సముద్రఖని, ఐశ్వర్యరాయ్ తదితరులు నటించారు.