కర్నూలు లెక్కలు మారుస్తున్న జగన్..?

మరోసారి కర్నూలు కోటని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నారు..ఈ సారి అధికారంలోకి రావాలంటే కర్నూలు జిల్లానే వైసీపీకి సపోర్ట్‌గా ఉండాలి. గత ఎన్నికల్లో అంటే అన్నీ జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది..కాబట్టి అధికారంలోకి రావడం ఈజీ అయింది. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి..కొన్ని జిల్లాల్లో టీడీపీ పై చేయి సాధించేలా ఉంది..పైగా టీడీపీతో జనసేన కలిస్తే..సగం జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది.

అందుకే కంచుకోటల్లాంటి జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అలాంటి జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లు గెలిచేసుకుంది. ఈ సరి కూడా 14 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం అనేది కష్టమవుతుంది. ఈ సారి జిల్లాలో వైసీపీ 14కు 14 సీట్లు గెలుచుకోవడం కష్టమని తెలుస్తోంది.

కనీసం రెండు, మూడు సీట్లు మాత్రం కోల్పోయేలా ఉంది. ఇంకా రాజకీయం మారితే ఐదారు సీట్లు కూడా కోల్పోవచ్చు. అందుకే ఇప్పటినుంచే జగన్ అలెర్ట్ అయ్యారు. సరిగ్గా పనిచేయని వారి సీట్లు మార్చేయాలని చూస్తున్నారు. అలాగే కొత్తవారికి అవకాశం ఇస్తే వ్యతిరేకత కూడా కనబడదని భావిస్తున్నారు. కాకపోతే ఎవరి సీటు మారుస్తారనేది అర్ధం కాకుండా ఉంది.

ఎందుకంటే జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 9 మంది రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే. ఇద్దరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ముస్లిం ఎమ్మెల్యే. అయితే ఎస్సీ సీట్లు రెండు మారిపోవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇటు కర్నూలు సిటీలో ఉన్న హఫీజ్ ఖాన్ సీటుకు ఎస్వీ మోహన్ రెడ్డి ఎసరు పెట్టాలని చూస్తున్నారు. అటు పత్తికొండలో ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవి పనితీరు కూడా పెద్దగా బాగోలేదు. ఆమెకు నెక్స్ట్ సీటు డౌటే అని తెలుస్తోంది. ఇక రెడ్డి ఎమ్మెల్యేల్లో జగన్ ఎవరిని పక్కన పెడతారో క్లారిటీ లేదు. సొంత వర్గం కాబట్టి ఎవరిని తీసే ఛాన్స్ కనిపించడం లేదు. మొత్తానికి ఈ సారి కర్నూలులో కొందరు సిట్టింగులకు మాత్రం షాక్ తప్పేలా లేదు.

Share post:

Latest